Headlines

తెలంగాణ లో కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana Contract Outsourcing Jobs | TVVP 3,124 Jobs Recruitment 2023

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక శుభవార్త …

తెలంగాణలో 3,124 పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది .

తెలంగాణ వైద్య విధాన పరిస్థితుల్లో ఖాళీగా ఉన్న 3,124 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు .

తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.

ఈ పోస్టులను కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ , మినిమం టైం స్కేల్ విధానంలో భర్తీ చేస్తారు .

ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు వీరి సేవలను వినియోగించుకుని ఎందుకు తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు .

ఈ ఉత్తర్వులు ప్రకారం 968 మందిని కాంట్రాక్ట్ విధానములో , 2,029 మందిని అవుట్సోర్సింగ్ విధానంలో , 129 మందిని మినిమం టైమ్ స్కేల్ పద్ధతిలో నియమించుకునే అధికారం వైద్య విధాన పరిషత్ కమిషనర్ కు ఇవ్వడం జరిగింది . 

ఈ పోస్టులలో స్టాఫ్ నర్స్ , ల్యాబ్ టెక్నీషియన్ , ఫార్మసిస్ట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ , రేడియాలజీ టెక్నీషియన్ ,  వెంటిలేటర్ టెక్నీషియన్ , MNO /FNO , ANM , డార్క్ రూమ్ అసిస్టెంట్ , డెంటల్ అసిస్టెంట్ సర్జన్ , మెడికల్ ఆఫీసర్ , దోబి , ఎలక్ట్రీషియన్ , ల్యాబ్ అటెండెంట్ , ఆఫీస్ అటెండర్ , జూనియర్ అనలిస్ట్ , ఆఫీస్ సబార్డినేట్ ,ఆఫీస్ అటెండర్, డ్రైవర్ , బయో మెడికల్ టెక్నీషియన్ , గార్డినర్ , ఫిజియోథెరపిస్ట్ , కుక్ , సెక్యూరిటీ గార్డ్ మరియు వివిధ ఉద్యోగాలు ఉన్నాయి… 

ఈ పోస్టులు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కూడా ఉన్నాయి . ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తుంది..

ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ విడుదల చేసిన అధికారిక జీవోను డౌన్లోడ్ చేసుకుని మీ జిల్లాలో ఏ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూడండి .

Download Official G.O

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!