Headlines

AIIMS NORCET 5 Notification in Telugu | AIIMS NORCET 5 Vacancies | AIIMS Nursing Officer Qualification, Syallabus , Age , Selection Process

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ లలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు . 

నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన పురుష మరియు మహిళా అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు. 

ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం NORCET పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసి నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు . ఈ సంవత్సరం NORCET – 4 నోటిఫికేషన్ విడుదలయ్యాక రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా పూర్తి అయ్యింది .

ఇప్పుడు మరికొన్ని నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం NORCET – 5 నోటిఫికేషన్ విడుదల చేశారు .

ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే మన సొంత రాష్ట్రంలోని ఉద్యోగం పొందే అవకాశం ఉంది .

ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ లలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది .  ఆన్లైన్లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఆగస్ట్ 25వ తేదీ లోపు అప్లై చేయాలి . 

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

✅ NORCET నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తక్కువ ధరలో టెస్ట్ సిరీస్ కావాలంటే మన ” INB Jobs ” యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి 👇👇👇👇

📌 Download ”  INB Jobs ” APP

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఎయిమ్స్ , న్యూ ఢిల్లీ

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : నోటిఫికేషన్ లో తెలియజేయలేదు . తర్వాత నోటిఫై చేస్తారు

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 అర్హతలు : 

  1. బిఎస్సి నర్సింగ్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు . స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి ( లేదా )
  2. GNM పూర్తి చేసి కనీసం 50 బెడ్లు గల హాస్పిటల్లో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి . స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి

ముఖ్యమైన తేదీలు : 

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 05-08-2020

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 25-08-2023

🔥 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 17 – 2023

🔥 మెయిన్స్ పరీక్ష తేదీ  : అక్టోబర్ 7 – 2023 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు ( 25-08-2023 నాటికి ) 

🔥గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు ( 25-08-2023 నాటికి ) 

🔥 వయస్సు సడలింపు :  ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 పరీక్ష విధానం : ప్రిలిమ్స్ లో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను వంద మార్కులకు గాను ఇస్తారు . ఇందులో 20 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ మరియు ఆటిట్యూడ్ నుంచి , 80 ప్రశ్నలు నర్సింగ్ సిలబస్ నుండి ఇస్తారు .

ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయితే చాలు ఇందులో వచ్చిన మార్కులు ఎంపిక ప్రక్రియలో పరిగణలోకి తీసుకోరు .

మెయిన్స్ లో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను వంద మార్కులకు గాను ఇస్తారు. ఈ 100 ప్రశ్నలు నర్సింగ్ సిలబస్ నుంచి వస్తాయి .

మెయిన్స్ లో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఫైనల్ సెలక్షన్ లిస్ట్ తయారు చేస్తారు .

ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ లో 1/3 నెగటివ్ మార్కింగ్ విధానం ఉంది .

🔥 ఫీజు : 2,400/- రూపాయలు ( ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు )

3000/- రూపాయలు ( జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు )

దివ్యాంగులైన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు .

🔥 అప్లికేషన్ విధానం : AIIMS న్యూ ఢిల్లీ అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Instragram Link – Click here 

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!