Headlines

బ్యాంక్స్ లో ఉద్యోగాలు భర్తీ | IBPS PO Notification in Telugu | IBPS Probationary officer Recruitment 2023

దేశంలో నిరుద్యోగ యువతకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ గుడ్ న్యూస్ చెప్పింది . 

వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రొబిషనరీ ఆఫీసర్స్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది .

దేశవ్యాప్తంగా 3,049 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది .

ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు .

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,049 పోస్టులు భర్తీ చేస్తున్నారు .

పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారికి వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .

ఈ నోటిఫికేషన్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా , కెనరా బ్యాంక్ , ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ , యూకో బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ ఇండియా , సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , పంజాబ్ నేషనల్ బ్యాంక్ , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర , ఇండియన్ బ్యాంక్ , పంజాబ్ మరియు సిండ్ బ్యాంక్ లలో ప్రొబిషనరీ ఆఫీసర్స్ లేదా మేనేజ్మెంట్ ట్రైని పోస్టులను భర్తీ చేస్తారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది .  ఆన్లైన్లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఆగస్ట్ 21వ తేదీ లోపు అప్లై చేయాలి . 

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ .

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 3,049 పోస్టులు

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ పాస్

ముఖ్యమైన తేదీలు : 

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 01-08-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 21-08-2023

🔥 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు డౌన్లోడ్ తేదీ – సెప్టెంబర్ 2023 

🔥 ప్రిలిమ్స్ పరీక్ష  : సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2023 లో

🔥 ప్రిలిమ్స్ ఫలితాలు : అక్టోబర్ 2023 లో 

🔥 మెయిన్స్ హాల్ టికెట్లు డౌన్లోడ్ తేదీ : అక్టోబర్ లేదా నవంబర్ 2023 లో 

🔥 మెయిన్స్ పరీక్ష : నవంబర్ 2023 లో

🔥 మెయిన్స్ పరీక్ష ఫలితాలు : డిసెంబర్ 2023 లో 

🔥 ఇంటర్వ్యూలు : జనవరి లేదా ఫిబ్రవరి 2024 లో 

🔥 ప్రొవిజినల్ అలాట్మెంట్ : ఏప్రిల్ 2024లో

🔥 కనీస వయస్సు : 20 సంవత్సరాలు

🔥గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు :  ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . 

🔥 ఆంధ్రప్రదేశ్ లో ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు :

అనంతపూర్ , చీరాల, చిత్తూరు ,ఏలూరు ,గుంటూరు ,కడప ,కాకినాడ ,కర్నూలు ,నెల్లూరు ,ఒంగోలు , రాజమండ్రి , శ్రీకాకుళం , తిరుపతి విజయవాడ , విశాఖపట్నం , విజయనగరం .

🔥 ఆంధ్రప్రదేశ్ లో మెయిన్స్ పరీక్ష కేంద్రాలు : గుంటూరు , కర్నూలు , విజయవాడ , విశాఖపట్నం

🔥 తెలంగాణలో ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్ , కరీంనగర్ , ఖమ్మం , వరంగల్

🔥 తెలంగాణలో మెయిన్స్ పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్ , కరీంనగర్

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ప్రిలిమ్స్ , మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు .

🔥 పరీక్ష విధానం : ప్రిలిమ్స్ లో 100 ప్రశ్నలు వంద మార్కులకు గాను ఇస్తారు .

మెయిన్స్ లో 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను 200 మార్కులకు ఇస్తారు .

మెయిన్స్ లో లెటర్ రైటింగ్ మరియు ఎస్సై రెండు ప్రశ్నలు 25 మార్కులకు ఇస్తారు .

🔥 ఫీజు : 175/- రూపాయలు ( ఎస్సీ , ఎస్టీ మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు )

850/- రూపాయలు ( మిగతా అభ్యర్థులకు )

🔥 అప్లికేషన్ విధానం : IBPS అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!