హైదరాబాదులో ఉన్న నీలోఫర్ ఆసుపత్రి సూపరిండెంట్ కార్యాలయం నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది .
అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్ ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు .
ఈ ఉద్యోగాలు జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా భర్తీ చేస్తున్న పోస్టులు .
ఈ ఉద్యోగాలకు అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు తమకు చెందిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లకు సంబంధించిన జిరాక్స్ కాపీల పై Self Attestation చేసి వాటితో పాటు ఇంటర్వ్యూకు హాజరు కావాలి .
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇
NHM , SNCU , నీలోఫర్ ఆసుపత్రి , హైదరాబాద్ పరిధిలో సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ వద్ద పనిచేయుటకు స్పెషలిస్ట్ డాక్టర్లు స్టాఫ్ నర్స్ కోసం ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు .
సూపరిండెంట్ కార్యాలయం , నీలోఫర్ ఆసుపత్రి , రెడ్ హిల్స్ , లక్డికాపూల్ , హైదరాబాద్ వద్ద స్వయంగా అన్ని సెల్ఫ్ అటిస్టెడ్ జిరాక్స్ కాపీల సెట్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లతో జూలై 20 / 2023 వ తేదీన Walk-in Interview కి హాజరు కావలసిందిగా అర్హులైన అభ్యర్థులకు విజ్ఞప్తి .