Headlines

ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలు | AP Medical Services Recruitment Board Assistant Professors Jobs Recruitment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదలైంది . 

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో మరియు టీచింగ్ హాస్పిటల్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

ఈ నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది .

తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ జూలై 26 , 2023 .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 590

🔥 అర్హతలు :  MCI / NMC / DCI నుండి గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలిటీలో MD / MS / DNB / DM / MD పూర్తి చేసి ఉండాలి .

ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు లేకపోతే సంబంధిత స్పెషలిటీలో రెగ్యులర్ విధానంలో ఎంఎస్సీ పూర్తి చేసి PHD చేసిన వారిని తీసుకుంటారు .

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 17-07-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 26-07-2023

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

ఎస్సీ , ఎస్టీ , బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది .

PWD అభ్యర్ధులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది  .

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది . అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయాలి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!