Headlines

APPSC Dy. EO Qualification, age , Vacancies Details | APPSC Deputy Education Officer Jobs Recruitment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదుగా భర్తీ చేసే ఉద్యోగాలు అయిన డిప్యూటీ ఈవో ఉద్యోగాల భర్తీ కోసం అనుమతులు వచ్చాయి .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ ఈవో ఉద్యోగాల భర్తీ కోసం ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది . ఈ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆదేశాలు కూడా ఇచ్చారు .

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో ఖాళీగా ఉన్న 38 డిప్యూటీ విద్యాశాఖ అధికారుల ఖాళీలు వివరాలు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ పై సమీక్ష జరిపినప్పుడు ముఖ్యమంత్రి వారి వద్ద ఉంచడం జరిగింది .

గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపారు .

ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు సంబంధించి పూర్తిస్థాయి కసరత్తు జరిగిన తర్వాత ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది . ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ త్వరలో విడుదల చేయబోతుంది .

మొత్తం 38 డిప్యూటీ విద్యాశాఖ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ఇచ్చిన జీవోలో పేర్కొంది .

ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు .

ఈ పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు సంబంధిత శాఖ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు లో తెలియజేయడం జరిగింది .

ఖాళీలు , రోస్టర్ పాయింట్లకు సంబంధించిన సమాచారం ఏపీపీఎస్సీకి చేరిన తర్వాత ఏపీపీఎస్సీ ఈ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది .

ఈ ఉద్యోగాలు జోనల్ స్థాయి ఉద్యోగాలు .

ఈ పోస్టులకు ఉండవలసిన అర్హత ఏమిటి అనగా , బీఈడీలో మెథడాలజీ సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!