ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు .
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు .
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు .
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన డైరెక్టర్ కార్యాలయం నుండి విడుదల చేయడం జరిగింది . ఈ కార్యాలయం గుంటూరులో ఉంది .
ఈ నోటిఫికేషన్ ద్వారా మిషన్ శక్తి క్రింద ఆరు పోస్టులు మిషన్ వాత్సల్య కింద 11 పోస్టులను భర్తీ చేస్తున్నారు .
మిషన్ క్రింద భర్తీ చేస్తున్న పోస్టులు :
జెండర్ స్పెషలిస్ట్ , రీసెర్చ్ మరియు ట్రైనింగ్ స్పెషలిస్ట్ , అకౌంట్స్ అసిస్టెంట్ , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ , ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ .
మిషన్ వాత్సల్య క్రింద భర్తీ చేస్తున్న పోస్టులు :
ప్రోగ్రాం మేనేజర్ , ప్రోగ్రాం అసిస్టెంట్ , అకౌంట్స్ అసిస్టెంట్ , ప్రోగ్రాం అసిస్టెంట్ , అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నుండి 15 రోజుల్లోపు అప్లికేషన్ పంపాలి.
ప్రభుత్వ నిబంధనలు మేరకు అన్ని రకాల రిజర్వేషన్లు వర్తిస్తాయి .
ఒక పోస్ట్ కు ఒక అప్లికేషన్ తో మాత్రమే అప్లై చేయగలరు.
షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు .
గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి.
✅ Download Notification & Application