ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భువనేశ్వర్ నుండి 72 రకాల పోస్టులతో , మొత్తం 775 ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు . అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలు కూడా పర్మినెంట్ ఉద్యోగాలే
నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి , గ్రూప్ సి నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .
ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులు ఫీజు కూడా చెల్లించాలి .
అన్ రిజర్వడ్ మరియు ఓబిసి అభ్యర్థులు 3000/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
ఎస్సీ , ఎస్టీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2,400/- ఫీజు చెల్లించాలి .
దివ్యాంగులైన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు .
అప్లై చేసిన ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు పరీక్ష రాసి పరీక్షకు సంబంధించిన ఫలితాలు వెల్లడైన తర్వాత వారు చెల్లించిన ఫీజు రిఫండ్ చేయడం జరుగుతుంది.
పోస్ట్లు ను బట్టి వివిధ అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు .
ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఉద్యోగాలను బట్టి కనీస వయస్సు 18 సంవత్సరాలు నుండి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు వరకు ఉంటుంది .
అలాగే ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో వయో సడలింపు ఉంటుంది .
ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు . ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది . కంప్యూటర్ ఆధారిత పరీక్ష తోపాటు కొన్ని రకాల ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది . ఈ స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది .