Headlines

AP SSC Board Junior Assistant and Data ప్రోసెసింగ్ Assistant Jobs | AP Outsourcing Jobs Recruitment 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేయవచ్చు .

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదో తరగతి బోర్డు నుండి విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో ఏటువంటి రాత పరీక్ష ఉండదు .

ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు అవుతారు .

నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత , అప్లై చేసుకున్న అభ్యర్ధుల నుండి మెరిట్ , మరియు ప్రొఫిసియన్సీ టెస్ట్ లో వచ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు . ఈ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్  విధానంలో భర్తీ చేస్తున్నారు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్లో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ కూడా క్రింద ఉన్నవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి బోర్డు 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – ఔట్ సోర్సింగ్ జాబ్స్ 

పోస్టుల పేర్లు : జూనియర్ అసిస్టెంట్ మరియు డేటా ప్రోసెసింగ్ అసిస్టెంట్

మొత్తం పోస్టులు : 12

అర్హతలు : విద్యార్హత వివరాలు ఇలా ఉన్నాయి. 

1. గుర్తింపు పొందిన భారతదేశంలోని విశ్వవిద్యాలయం నుంచి గుర్తింపు పొందిన , లేదా విలీనం చేయబడిన , కేంద్ర చట్టం లేదా రాష్ట్ర చట్టం ద్వారా లేదా తాత్కాలిక చట్టం ద్వారా లేక యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి . 

2. టైపింగ్ స్కిల్స్ ప్లస్ తో కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి .MS Office /PGDCA / DCA/ఇంజనీరింగ్ సర్టిఫికేట్/ఏదైనా కంప్యూటర్లతో గ్రాడ్యుయేషన్.

ముఖ్యమైన తేదీలు 

నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ : 21-06-2023

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 21-06-2023

అప్లై చేయడానికి చివరి తేదీ : 07-07-2023

✅ షార్ట్ లిస్ట్ ఫైనల్ చెయ్యి తేదీ : 11-97-2023

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయు తేదీ : జూలై 13 , 14 తేదీల్లో

కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహించే తేదీ : జూలై 16 , 17 తేదీల్లో

ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల : 19-07-2023

కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు 

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , 

జీతం ఎంత ఉంటుంది : 

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు – 18,500/-

డేటా ప్రోసెసింగ్ అసిస్టెంట్ ఉద్యోగానికి – 18,500/-

పరీక్ష విధానం : ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష లేదు . స్కిల్ టెస్ట్ ఉంటుంది.

ఎంపిక విధానం : ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతలు అయిన 10వ తరగతికి 25 మార్కులు ,  ఇంటర్మీడియట్ కు 25 మార్కులు , డిగ్రీ కు 30 మార్కులు , కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ కు 20 మార్కులు కేటాయిస్తారు .

✓ సమానమైన మెరిట్ వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు వారిలో ఎక్కువ వయసు ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు .

✓ ఇద్దరు అభ్యర్థుల్లో వయసు కూడా సమానం గల అభ్యర్థులు ఉంటే , మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు .

✓ ఇద్దరు వయస్సు సమానంగా ఉండి ఇద్దరు అభ్యర్థులు మహిళలైతే ఇలాంటి సందర్భంలో క్రింది రిజర్వేషన్ల ప్రకారం మొదటి ర్యాంకు ఇస్తారు.

  1. SC 2) ST 3) BC 4) OC 

ప్రొఫెషియన్సీ టెస్ట్ కి సంబంధించిన తేదీ సమాచారం 1:5 నిష్పత్తిలో ఎంపిక కాబడిన అభ్యర్థుల మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా లేదా ఫోన్ చేయడం ద్వారా తెలియజేయడం జరుగుతుంది . అలాగే అధికారిక వెబ్సైట్ కూడా తరచుగా చూస్తూ ఉండాలి. 

 ఫీజు : అప్లై చేసే అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులకు అప్లై చేసే ప్రతి ఉద్యోగానికి వేరువేరుగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి . ఈ ఫీజును అధికారిక వెబ్సైట్లో నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు .

Note : ఫీజు ఒకసారి చెల్లించిన తర్వాత రిఫండ్ చేయడం జరగదు .

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

YouTube Channel – Click here

Telegram Group – Click here

Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!