Headlines

పది పాస్ అయితే అటవీ శాఖలో ఉద్యోగం | Forest Department Jobs in Telugu | Government Jobs in Telugu

10th , 12th , Degree , PG అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ ఒక సూపర్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయిన పర్యావరణ , అటవీ, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ నుండి విడుదల అయ్యింది. 

భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు . 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 రకాల వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు . 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల యొక్క సమాచారాన్ని పూర్తిగా నోటిఫికేషన్ చదివాకే అర్హులైన వారు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది . 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా జూన్ 30వ తేదీ లోపు సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేయాలి.

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : పర్యావరణ , అటవీ, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ , భారత ప్రభుత్వం .

🔥  మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 15 పోస్టులు

భర్తీ చేస్తున్న పోస్టులు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ , అసిస్టెంట్ గ్రేడ్ -3 , టెక్నీషియన్ , టెక్నికల్ అసిస్టెంట్ , అసిస్టంట్ డైరక్టర్ , సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ , 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – ఈ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు .

అర్హతలు : 10th , ఇంటర్, డిగ్రీ , PG ఒంటి అర్హతలతో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు .

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది . 

అప్లై చేయడానికి చివరి తేదీ : 30-06-2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : అన్ని రకాల ఉద్యోగాలకి గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు .  సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగానికి మాత్రం గరిష్ట వయస్సు 40 ఏళ్లకు మించకూడదు .

🔥 వయస్సు సడలింపు :  భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు .

అనగా ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,  ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు , మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసుడలింపు కలదు . 

ఫీజు : 700/- ఫీజు చెల్లించాలి . ఇందులో అప్లికేషన్ ఫీజు 500/- ,  ఫీజు 200/- రూపాయలు చొప్పున చెల్లించాలి .  ఈ ఫీజు ఏదైనా డీడీ రూపంలో ఏదైనా జాతీయ బ్యాంక్ లో డైరక్టర్ , వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్ అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా చెల్లించాలి. 

ఎస్సీ, ఎస్టీ, PWD, మరియు మహిళలు అప్లికేషన్ ఫీజు 500/- చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ ప్రోసెసింగ్ ఫీజు 200/- చెల్లించాలి.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష పెట్టి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు . 

🔥 పరిక్ష కేంద్రాలు : పరీక్ష కేంద్రాల వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు . కానీ పరీక్ష డెహ్రాడూన్ లో నిర్వహించడం జరుగుతుంది అని నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది . పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారికి వెబ్సైట్లో చూస్తూ ఉండాలి .

పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ఉంటుంది .

అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగానికి ప్రశ్నాపత్రంలో 60 ప్రశ్నలు 60 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది . అన్ని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి .

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగానికి ప్రశ్నాపత్రంలో వంద ప్రశ్నలు వంద మార్కులకు ఉంటుంది . ఇందులో కూడా అన్ని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలోనే ఉంటాయి .

టెక్నీషియన్ ఉద్యోగానికి కూడా 100 ప్రశ్నలు వంద మార్కులకే ఉంటుంది ప్రశ్నాపత్రం. ఇందులో కూడా అన్ని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలోనే ఉంటాయి. 

టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్ , టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రశ్నాపత్రం 70 మార్కులకు 70 ప్రశ్నలు ఇస్తారు . ఈ 70 ప్రశ్నలు కూడా మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి . మరో 30 మార్కులకు ఎస్సే రైటింగ్ ఉంటుంది .

ఈ అన్ని పరీక్షల్లో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఇస్తారు . ప్రతి తప్పు సమాధానం కి అర మార్కు తగ్గించడం జరుగుతుంది.

అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగానికి పరీక్షలో వచ్చిన మార్కుల మార్కుల ఆధారంగా 1:5ఐదు నిష్పత్తిలో ప్రొఫెషన్షి టెస్ట్ అనగా టైపింగ్ టెస్ట్ కు పిలవడం జరుగుతుంది .

🔥 ముఖ్యమైన సూచనలు :

ఈ ఉద్యోగాల ఎంపికలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రకాల రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కలదు విద్యార్హత మరియు వయస్సు విషయం లో ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీనే Cut-off తేది . ( 30-06-2023 ).

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

ముఖ్యమైన నిబంధనలు :

  1. ఈ పోస్టులకు అప్లై చెసే అభ్యర్థులు ” ది డైరెక్టర్ , వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా , చంద్రబాని, డెహ్రాడూన్ , ఉత్తరాఖండ్ .
  2.  ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ – 30/06/2023
  3. EWS సర్టిఫికేట్ ఉంటేనే EWS రిజర్వేషన్ వర్తిస్తుంది.
  4. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పకుండా అవసరమైన సర్టిఫికెట్స్ పైన సెల్ఫ్ అట్టేస్టేషన్ చేసి అప్లికేషన్ తో పాటు జతపరిచి సీల్డ్ కవర్ లో పెట్టీ కవర్ పైనా ఏ పోస్ట్లుకు అప్లై చేస్తున్నారో క్యాపిటల్ లెటర్ లో రాసి అప్లికేషన్ పంపించాలి. 
  5. SC, ST , OBC అభ్యర్ధులు రిజర్వేషన్ వర్తించాలి అంటే తప్పకుండా సంబంధిత అధికారులు ఇచ్చే జారీ చేయబడిన సర్టిఫికెట్ యొక్క కాఫీను అప్లికేషన్ తో పాటు జతపరచాలి. 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!