Headlines

ESIC Staff Nurse Vacancies Update | New Staff Nurse Vacancies Details

దేశంలో నర్సింగ్ ఆఫీసర్స్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఈ నేపథ్యంలో లో నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ మరో సారి చర్చకు వచ్చింది . దేశవ్యాప్తంగా ESIC మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ లో అత్యవసరంగా ఉద్యోగాలని భర్తీ చేయాలంటూ ఆల్ ఇండియా ESIC నర్సింగ్ ఆఫీసర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయిన శాంతి సుబ్రహ్మణ్యం మరియు సెక్రటరీ జనరల్ అయినా జోద్రాజ్ బైర్వా నుండి కేంద్ర ప్రభుత్వ గౌరవ మంత్రివర్యులు భూపేంద్ర యాదవ్ ( మినిస్ట్రీ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ ) కు ఒక లేఖ రాశారు .

ఇలా ఉద్యోగాల భర్తీ చేయాలి అని లేఖ రాయడం ఇది మూడవ సారి.. 

ఈ లేఖలో ESIC నుండి ఈ మధ్యకాలంలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు అని చివరిసారిగా 2018 లో నోటిఫికేషన్ విడుదల చేశారు అని అది కూడా రెండు నుంచి మూడు ESIC రీజియన్ నుండి మాత్రమే నోటిఫికేషన్ విడుదల అయింది అని స్పష్టం చేయడం జరిగింది . గత దశాబ్ద కాలంగా చాలా రీజన్స్ లో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని పేర్కొనడం జరిగింది . 

దీనివలన ఈఎస్ఐసీల్లో నర్సింగ్ కేడర్ మానవ కొత్త తీవ్రంగా వేధిస్తుంది అని కూడా గుర్తు చేశారు. 

ESIC లో పనిచేస్తున్న వారిలో 70 శాతం మంది కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఎంపికైన వారే . ఈ విధంగా పోస్ట్లు భర్తీ చేయకపోవడం వలన ప్రస్తుతం పని చేస్తున్న వారిపై తీవ్రమైన భయంకరమైన ఒత్తిడి ఏర్పడి పేషెంట్లకు సరైన వైద్యం అందడం లేదు అని కూడా గుర్తు చేశారు . 

గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ప్రభుత్వ లేదా పబ్లిక్ సెక్టార్ రంగంలో ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేసే విధంగా మానవ వనరుల కొరతను తీర్చే విధంగా సాధ్యమైనంత త్వరగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని గతంలో ఆదేశాలు కూడా జారీ చేశారని గుర్తు చేయడం జరిగింది .

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి 2022 , 2023 సంవత్సరాల్లో వచ్చిన లేఖలను ప్రస్తావించి అవి విడుదలై ఒక సంవత్సరం ముగిసింది అని కూడా గుర్తు చేశారు అయినప్పటికీ ఇప్పటివరకు నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని ప్రశ్నించడం జరిగింది . 

కాబట్టి ఇప్పటికైనా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాలని నర్సింగ్ ఆఫీసర్ ఫెడరేషన్ కోరుతున్నట్టుగా లేఖలు పేర్కొనడం జరిగింది .

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని ESIC ల్లో  ప్రస్తుతం ఖాళీల సమాచారం కూడా తెలిసింది .

ఆ వివరాలు ఇలా ఉన్నాయి 👇

అలాగే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని నీరు కేలం అనే వ్యక్తి ESIC హాస్పిటల్స్ లో ప్రస్తుతం ఎన్ని ఖాళీలు ఉన్నాయి ? నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ కోసం చివరిగా ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేశారు ? గత రెండు సంవత్సరాలుగా నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు ? నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి మళ్లీ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు అందులో ఎన్ని పోస్టులు భర్తీ చేయవచ్చు అని కోరుతూ ఒక లేఖ రాశారు .

RTI ద్వారా నీరు కేలం రాసిన బదులుగా అసిస్టెంట్ డైరెక్టర్ నుండి వచ్చిన సమాధానములో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ కోసం త్వరలో వచ్చే నోటిఫికేషన్ లో 1930 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది .

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!