Headlines

ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP Outsourcing Jobs Recruitment 2023 | APCOS

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేయవచ్చు .

ఈ నోటిఫికేషన్ YSR ఆరోగ్య విశ్వవిద్యాలయం నుండి విడుదల అయ్యింది .

ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు అవుతారు .

నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత , అప్లై చేసుకున్న అభ్యర్ధుల నుండి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు . ఈ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్లో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ కూడా క్రింద ఉన్నవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : YSR ఆరోగ్య విశ్వవిద్యాలయం

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – ఔట్ సోర్సింగ్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ , కంప్యూటర్ ఆపరేటర్

మొత్తం పోస్టులు : 13 

🔥 అర్హతలు : విద్యార్హత వివరాలు ఇలా ఉన్నాయి. 👇

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 16-06-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 27-06-2023

కనీస వయస్సు : 18 సంవత్సరాలు ( 01-07-2022 నాటికి )

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు ( 01-07-2022 నాటికి )

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 జీతం ఎంత ఉంటుంది : 

సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ – 31,500/- 

డేటా ఎంట్రీ ఆపరేటర్ – 18,500/- 

కంప్యూటర్ ఆపరేటర్ – 21,500/- 

పరీక్ష విధానం : ఈ ఉద్యోగాల ఎంపికలో పరీక్ష లేదు . స్కిల్ టెస్ట్ ఉంటుంది.

ఎంపిక విధానం : ఉద్యోగానికి అవసరమైన కనీస విద్యార్హతలు వచ్చిన మార్కుల నుండి 75% మార్కులు మరియు స్కిల్ టెస్ట్ కు 25% మార్కులు కేటాయించి మొత్తం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

సమానమైన మెరిట్ వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు వారిలో ఎక్కువ వయసు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు .

అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్టు జూలై 5న విడుదల చేస్తారు . దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 8 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఫైనల్ మెరిట్ లిస్టు జూలై 13న విడుదల చేస్తారు . స్కిల్ టెస్ట్ ఎప్పుడు నిర్వహిస్తారు అనేది అధికారిక వెబ్సైట్లో తరువాత వెల్లడిస్తారు. 

పరీక్ష తేదీకి సంబంధించిన సమాచారం అభ్యర్థుల యొక్క మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది . హాల్ టికెట్ ను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి .

🔥 ఫీజు : అప్లై చేసే అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులకు అప్లై చేసే ప్రతి ఉద్యోగానికి వేరువేరుగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి . ఈ ఫీజును అధికారిక వెబ్సైట్లో నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు .

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!