Headlines

పది పాస్ అయితే అటవీ శాఖలో ఉద్యోగం | WII Recruitment in Telugu

టెన్త్ , ఇంటర్ వంటి అర్హతలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కోసం అధికారికంగా ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది  . కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ, భారత ప్రభుత్వం చెందిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది . నోటిఫికేషన్ ద్వారా వివిధ హోదాలు కలిగిన పోస్టులను భర్తీ చేస్తున్నారు . ఈ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో తెలియజేయడం జరిగింది ..

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారత పౌరుషత్వం కలిగిన అభ్యర్థులందరూ అప్లై చేయవచ్చు . 

ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ , అసిస్టెంట్ గ్రేడ్-3 , టెక్నీషియన్ , టెక్నికల్ అసిస్టెంట్ , అసిస్టెంట్ డైరెక్టర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు . 

పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారికి వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .

ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది . ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు తమ యొక్క అప్లికేషన్ ను జూన్ 30వ తేదీలోపు చేరే విధంగా పంపించాలి .

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు . 

🔥 గమనిక : నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 

✅ మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 15 

✅ అర్హతలు : 10th , ఇంటర్ మరియు ఇతర అర్హతలు

✅ అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది 

✅ అప్లై చేయడానికి చివరి తేదీ : 30-06-2023

పరీక్షా తేదీ : పరీక్షా తేదీ వివరాలూ వెబ్సైట్ లో తరువాత తెలియజేస్తారు . 

వయస్సు : MTS , అసిస్టెంట్ గ్రేడ్-3 , అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు నిండి 27 సంవత్సరాలు వరకు వయస్సు ఉండాలి .

టెక్నీషియన్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి .

సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు 40 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలి.

వయస్సు సడలింపు : 

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,

ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు,

ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

జీతం ఎంత ఉంటుంది : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు పే స్కేల్ లెవెల్-1 , అసిస్టెంట్ గ్రేడ్-3 మరియు టెక్నీషియన్ ఉద్యోగాలకు లెవెల్ -2 , టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు లెవెల్-6 , అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలకు లెవెల్-10, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు లెవెల్ -11 ప్రకారం జీతం ఉంటుంది .

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఒక పరీక్ష నిర్వహిస్తారు అందులో వచ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు . ఈ పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ఉంటుంది .

అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ప్రొఫిసియన్సీ టెస్ట్ ను నిర్వహిస్తారు . 

ఫీజు : మొత్తం – 700- ( ఇందులో అప్లికేషన్ ఫీజు 500/- రూపాయలు , ప్రొసెసింగ్ ఫీజు 200/-రూపాయలు క్రింద చెల్లించాలి . ఈ ఫీజు ఏదైనా జాతియ బ్యాంకులో డిడి రూపంలో డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా చెల్లించాలి .

ఎస్సీ , ఎస్టీ , PWD , మరియు మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు అయిన 500/- రూపాయలు లేదు . కానీ ప్రోసెసింగ్ ఫీజు అయినా 200 రూపాయలు చెల్లించాలి .

అప్లికేషన్ విధానం : వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ పంపించాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింది ఇచ్చిన లింకు ద్వారా నోటిఫికేషన్ ను మరియు అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత , ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయవచ్చు .

అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని జిరాక్స్ కాపీల పైన అనగా విద్యార్హత సర్టిఫికెట్లు , అనుభవం , వయస్సు తెలిపే సర్టిఫికెట్ , మరియు కుల ధ్రువీకరణ పత్రము వంటి వాటిపైన సెల్ఫ్ అట్టేస్టేషన్ చేసి ఒక కవర్లో పెట్టి కవరు పైన మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో తెలిసే విధంగా క్యాపిటల్ లెటర్స్ లో రాసి అప్లికేషన్ ను పంపించాలి .

అప్లికేషన్ పంపవలసిన చిరునామా : “The Director, Wildlife Institute of India, Chandrabani, Dehradun, Uttarakhand”.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి

అప్లికేషన్ – ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!