Headlines

ITBP Head Constable Mid Wife Recruitment | Govt jobs

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ . కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ చెందిన ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ( మిడ్ వైఫ్ ) ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు .

ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది .

ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి . ప్రస్తుతానికి ఈ ఉద్యోగాలను తాత్కాలిక విధానంలో భర్తీ చేస్తున్నప్పటికీ పర్మినెంట్ చేసే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేశారు .

నోటిఫికేషన్ లో ప్రస్తుతం పేర్కొన్న 81 ఉద్యోగాలకు అదనంగా కొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్

🔥  మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 81 

భర్తీ చేస్తున్న పోస్టులు : హెడ్ కానిస్టేబుల్ ( మిడ్ వైఫ్ )

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – ప్రస్తుతానికి తాత్కాలిక విధానంలో ఉద్యోగంలోకి తీసుకుంటారు , తర్వాత పర్మినెంట్ చేస్తారు

అర్హతలు : పదో తరగతి అర్హతతో పాటు ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు . తప్పకుండా రాష్ట్ర లేదా సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : జూన్ 9 -2023 నుండి 

అప్లై చేయడానికి చివరి తేదీ : జూలై 8 -2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు :  భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు .

ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , 

ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు వారి యొక్క సర్వీస్ ఆధారంగా మూడు సంవత్సరాలు వయో సడలింపు తప్పకుండా ఉంటుంది .

జీతం ఎంత ఉంటుంది : 7వ వేతన సవరణ ప్రకారం 25,500/- నుండి 81,100/- వరకు ఉంటుంది .

🔥 పరీక్షా కేంద్రాలు : నోటిఫికేషన్ లో ఈ వివరాలు పేర్కొనలేదు

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : శారీరక కొలతలు , శారీరిక దారుఢ్య పరీక్షలు , రాత పరీక్ష , ప్రాక్టికల్ పరీక్ష , వైద్య పరీక్షలు, మరియు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు

🔥 రాత పరీక్షలో జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 35 శాతం మార్కులు రావాలి . ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు కనీసం 33% మార్కులు రావాలి ఇలా వస్తేనే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు .

రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారి నుండి కేటగిరి వారిగా ప్రతి పోస్ట్ కి పదిమంది చొప్పున సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి పిలుస్తారు . తరువాత ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు . మెడికల్ ఎగ్జామినేషన్లో అన్ ఫిట్ అయినవారికి రివ్యూ మెడికల్ ఎగ్జామ్ కి హాజరయ్యే అవకాశం కల్పిస్తారు.  వీటన్నింటినీ ఆధారంగా చేసుకుని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది

ఫీజు : అర్హులైన మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు 

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!