Headlines

సొంత ఊరిలో అంగన్వాడీ ఉద్యోగాలు | AP Anganwadi Jobs Recruitment 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త , మినీ అంగన్వాడీ కార్యకర్త , అంగన్వాడి సహాయకుల ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు . 

నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుండి ఏడు రోజుల్లోగా ఈ పోస్టులకు అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది .

గతంలో ముఖ్యమంత్రి గారు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖపై సమీక్ష జరిపిన సందర్భంగా ఈ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మరో జిల్లాలో ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు . ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనంతపురం జిల్లాలోని 10 ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి విడుదల చేయడం జరిగింది .

తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ మే 12 , 2023 .

 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ , అనంతపురం జిల్లా

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 29

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ 

అర్హతలు : 10వ తరగతి

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 05-05-2023

అప్లై చేయడానికి చివరి తేదీ : 12-05-2023

కనీస వయస్సు : 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు

గమనిక : ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతములలో 21 సంవత్సరాలు కలిగిన అభ్యర్థి లేకపోయినట్లయితే 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా తీసుకోవడం జరుగుతుంది .

అర్హతలు : 

అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రోఫార్మాలో ప్రకటన వెలువడిన తేది నుండి 7 రోజులలోగా అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.

అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో అభ్యర్థులకు ప్రభుత్వ నియామకమగు G.O.MS.NO.13_WCD&SC (PROGS) తేది 26/06/19 ప్రకారం చెల్లించబడును. 

• రూల్ అఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును.

● అంగన్వాడి కార్యకర్త , మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును. అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం కి చెందిన స్థానికులు అయి ఉండవలెను.

01.07.2022 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను. SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు.

అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST హాబిటేషన్స్ నందు ఉండు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.

అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును.

అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే, తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్లు జతపరచాలి. స్క్రూటినీ సమయములో CDPO ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి. CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావలెను. కులము, నివాస పత్రములు సంబందిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవికరణ చేసినవి జతపరచవలయును. దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి, ఫోటో పైన అభ్యర్తి సంతకము చేయవలయును. 

జీతం ఎంత ఉంటుంది

అంగన్వాడి కార్యకర్తకు – 11,500 రూపాయలు

మినీ అంగన్వాడి కార్యకర్తకు – 7,000/- 

అంగన్వాడి సహాయకులకు – 7,000/-

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

పరీక్ష విధానం : పరీక్ష లేదు , ఇంటర్వ్యు నిర్వహిస్తారు .

ఫీజు : లేదు 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ నింపి సంబంధిత కార్యలయం లో అప్లై చేయండి. 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!