Headlines

NIRDPR recruitment 2023 |Young fellow

కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలో గల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ సంస్థ నుండి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది, ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ఫెలో అనే ప్రోగ్రాం లో భాగంగా 141 పోస్టులను రిక్రూట్ చేస్తున్నారు.ఒక సంవత్సరం కాలపరిమితి కి ఈ రిక్రూట్మెంట్ జరుపుతారు. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లో 10 పోస్ట్లు,తెలంగాణ లో 8 పోస్ట్లు వున్నాయి.

హోదా : యంగ్ ఫెలో

రిక్రూట్మెంట్ విధానం: ఔట్ సోర్సింగ్

ఖాళీల సంఖ్య :141

కేటగిరీఖాళీల సంఖ్య
ఎస్సి 21
ఎస్టి10
ఓబిసి38
EWS14
UR58
PWD 6
మొత్తం141

విద్యార్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ / యూనివర్శిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ లేదా రెండు సంవత్సరాల PG పూర్తి చేసి వుండాలి.
  • పదవ తరగతి లో 60 శాతం మార్కులు,ఇంటర్మీడియేట్ లో 50 శాతం మార్కులు,డిగ్రీ లోని సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్ లో 50 శాతం మార్కులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 50 శాతం మార్కులు వచ్చి యుండాలి.
  • ఇంగ్లీష్ చదవడం, వ్రాయడం,మాట్లాడడం వచ్చి వుండాలి.
  • MS ఆఫీస్, ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చే కెపాసిటీ వంటి సాప్ట్ స్కిల్స్ కలిగి వుండాలి.

వయస్సు: 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి. Cut-off డేట్ గా 01/04/2023 ను నిర్ణయించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ వర్గాల వారికి వయోపరిమితి వుంటుంది.

జీతం: ప్రతినెలా రూ.35,000/- జీతం లభిస్తుంది.దీనితో పాటుగా క్లస్టర్ బయట పని చేయాల్సి వస్తె ట్రావెలింగ్ & టూర్ ఖర్చు ఇస్తారు.

అప్లై చేయు విధానం: అధికారిక వెబ్సైట్ అయినటువంటి http://career.nirdpr.in/ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఫీజు: జనరల్/OBC/EWS కేటగిరీ వారు – 300 రూపాయలు అప్లికేషన్ ఫీజు SBI – కలెక్ట్ ద్వారా పే చేయాలి.

SC/ST /PWD వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

రాత పరీక్ష కేంద్రం: దేశంలో 9 ప్రాంతాలలో పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ – హైదరాబాద్ నందు పరీక్ష నిర్వహిస్తారు.

👉NOTIFICATION – CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!