ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్(ఇంజనీరింగ్ & నాన్ ఇంజనీరింగ్) రిక్రూట్మెంట్ చేసేందుకు గాను సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి దివ్యాంగులు మాత్రమే అర్హులు.
ముఖ్యమైన తేదీలు: APPSC అధికారిక వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రారంభ తేదీ:27/04/2023
ఫీజు పేమెంట్ కి చివరి తేదీ:16/05/2023
చివరి తేదీ:17/05/2023
పోస్టుల వివరాలు:
పోస్ట్ కోడ్ | పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య |
01 | లెక్చరర్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ | 02 |
02 | లెక్చరర్ ఇన్ కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్ | 01 |
03 | లెక్చరర్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ | 01 |
04 | లెక్చరర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ | 05 |
05 | లెక్చరర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ | 01 |
06 | లెక్చరర్ ఇన్ ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | 04 |
07 | లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ | 03 |
08 | లెక్చరర్ ఇన్ మాథెమాటిక్స్ | 01 |
09 | లెక్చరర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ | 02 |
10 | లెక్చరర్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ | 01 |
మొత్తం | 21 |
విద్యార్హతలు:
పోస్ట్ కోడ్ | పోస్ట్ పేరు | విద్యార్హతలు |
01 | లెక్చరర్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ | సంబంధిత విభాగంలో(ఇంజనీరింగ్/టెక్నాలజీ) 1st క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. |
03 | లెక్చరర్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ | సంబంధిత విభాగంలో(ఇంజనీరింగ్/టెక్నాలజీ) 1st క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. |
04 | లెక్చరర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ | సంబంధిత విభాగంలో(ఇంజనీరింగ్/టెక్నాలజీ) 1st క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. |
05 | లెక్చరర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ | సంబంధిత విభాగంలో(ఇంజనీరింగ్/టెక్నాలజీ) 1st క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. |
06 | లెక్చరర్ ఇన్ ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | సంబంధిత విభాగంలో(ఇంజనీరింగ్/టెక్నాలజీ) 1st క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. |
09 | లెక్చరర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ | సంబంధిత విభాగంలో(ఇంజనీరింగ్/టెక్నాలజీ) 1st క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. |
10 | లెక్చరర్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ | సంబంధిత విభాగంలో(ఇంజనీరింగ్/టెక్నాలజీ) 1st క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. |
07 | లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ | సంబంధిత సబ్జెక్ట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. |
08 | లెక్చరర్ ఇన్ మాథెమాటిక్స్ | సంబంధిత సబ్జెక్ట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. |
02 | లెక్చరర్ ఇన్ కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్ | 1.కామర్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేయాలి.2 స్టేట్ బోర్డ్ టెక్నికల్ ట్రైనింగ్ వారు ద్వారా ఇంగ్లీష్ హైయర్ టైప్ రైటింగ్ మరియు షార్ట్ హ్యాండ్ వచ్చి వుండాలి. |
అప్లై చేయు విధానం:APPSC నోటిఫికేషన్లు కి మొదటి సారిగా అప్లై చేస్తూ వున్నట్లు అయితే ముందుగా వెబ్సైట్ లో OTPR అప్లికేషన్ సబ్మిట్ చేసి OTPR ID ను పొందాలి..తర్వాత OTPR ID & పాస్వవర్డ్ ద్వారా లాగిన్ అయి అప్లై చేసుకోవాలి.
వయస్సు: 18 సంవత్సరాలు నిండి యుండి 42 సంవత్సరాల లోపు గల వారు అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ వారీగా వయోపరిమితి వుంటుంది.
ఫీజు: రూ.250/- అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ విధానం ద్వారా పే చేయాలి.
సిలబస్:
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | కాలపరిమితి | మార్కులు |
పేపర్ -1 | జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ | 150 | 150(నిముషాలు) | 150 |
పేపర్ -2 | సంబంధిత సబ్జెక్ట్ | 150 | 150(నిముషాలు) | 150 |
తర్వాత 50 మార్కులకు గాను ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
350 మార్కులకు గాను రిక్రూట్మెంట్ జరుపుతారు.
పూర్తి సిలబస్ కొరకు నోటిఫికేషన్ చూడగలరు.
ఎగ్జామినేషన్ సెంటర్లు: దరఖాస్తుదారులు మూడు సెంటర్లు ఎంపిక చేసుకోవాలి.
సెలెక్షన్ విధానం: CBT పరీక్ష లో మరియు ఓరల్ ఇంటర్వ్యూ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది.
👉 Official Website – Click here
One thought on “APPSC Polytechnic lecturers recruitment 2023”