ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డీసీజస్ అండ్ రీసెర్చ్ సంస్థ 650 స్టాఫ్ నర్స్(క్లాస్-3) ఉద్యోగాల భర్తీ కొరకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు కోరుతుంది. ఈ సంస్థ గుజరాత్ లోని అహ్మదాబాద్ నందు కలదు.
మొదటి తేదీ:15/04/2023( 14::00 గంటలు) చివరి తేదీ:16/05/2023(17:00 గంటలు)
ఖాళీల వివరాలు:
మొత్తం 650 పోస్ట్లు కి గాను
SC – 45
ST -126
SEBC -181
GENERAL (EWS) -69
GENERAL -229 కేటగిరీ వారీగా రిజర్వ్ చేయబడ్డాయి.
విద్యార్హతలు:1. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నందు గుర్తింపు పొందిన సంస్థ నుండి B.sc (nursing) పాస్ కావాలి. (లేదా)
జనరల్ నర్శింగ్ అండ్ మిడ్ వైఫరీ( GNM) లో డిప్లొమా పూర్తిచేసి వుండాలి.అలానే అప్లికేషన్ పెట్టుకొనే నాటికి గుజరాత్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్స్ గా లేదా రిజిస్టర్డ్ మిడ్ వైఫ్ గా రిజిస్టర్ అయివుండాలి 2.గుజరాత్ సివిల్ సర్వీసెస్ క్లాసిఫికేషన్ అండ్ రిక్రూట్మెంట్ ( జనరల్) రూల్స్,1967 లో ఆదేశించిన ప్రకారం కంప్యూటర్ పై సాధారణ నాలెడ్జ్ వుండాలి.
3.గుజరాతీ లేదా హిందీ లేదా రెండింటి మీదా అవగాహన వుండాలి.
జీతబత్యాలు: ఈ స్టాఫ్ నర్స్( క్లాస్-3) పోస్ట్ కి సెలెక్ట్ కాబడితే రూ.29200- రూ.92300 పే స్కేల్ అప్లై అవుతుంది.
వయస్సు: 18-40 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి:1.గుజరాత్ కి చెందిన సోషల్లి బ్యాక్ వార్డ్ వారికి, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి -5 సంవత్సరాలు
2.40 శాతం అంగవైకల్యం కలిగిన దివ్యాంగులు వారికి – 10 సంవత్సరాలు వయోపరిమితి కలదు.
అప్లికేషన్ ఫీజు: ఆన్లైన్ ద్వారా అప్లై చేసేటప్పుడు రూ.1000/- అప్లికేషన్ ఫీజు పే చేయాలి.
ఇతర ముఖ్యమైన అంశాలు:
1.ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని వివరాలను https://ikdrc-its.org వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
2. నిర్ణీత దరఖాస్తులో అభ్యర్థి పూరించిన వివరాలు రిక్రూట్మెంట్ కొరకు తీసుకోవడం జరుగుతుంది. 3.ఒక అభ్యర్థి ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చు. 4. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థుల విషయంలో సంబంధిత అధికారి ద్వారా జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రం, నాన్-క్రిమినల్ సర్టిఫికేట్,ఆర్థికంగా బలహీనమైన విభాగం (EWS) సర్టిఫికేట్, విద్యార్హత మరియు వయోపరిమితి తేదీ నాటికి ప్రకటన యొక్క ప్రచురణ చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడుతుంది.
5.ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్ చెల్లుబాటు పరిగణించబడుతుంది, ఇతర మోడ్‌లో పంపినట్లయితే, అది చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడదు.
అప్లై చేసే విధానం:అధికారిక website ద్వారా 16/05/2023(17:00 గంటల)లోగా అప్లై చేయాలి.
Notification – Click here